పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారు | Came to the party .. Combination | Sakshi
Sakshi News home page

పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారు

Jan 16 2014 2:44 AM | Updated on Aug 11 2018 3:37 PM

ఉషారాణి విషయమై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ‘సాక్షి’ సంప్రదించగా ‘తెలుగుదేశం పార్టీ ప్రజాభిమానం చూరగొంటున్న పార్టీ.

ఉషారాణి విషయమై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ‘సాక్షి’ సంప్రదించగా ‘తెలుగుదేశం పార్టీ ప్రజాభిమానం చూరగొంటున్న పార్టీ. అందువల్ల అమా పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. పార్టీలో ఉన్న వారందర్నీ మేము ప్రోత్సహిస్తాము. త్వరలో హిందూపురానికి చెందిన అంబికా లక్ష్మినారాయణ కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరుకు చెందిన ఉషాదేవి పార్టీలోకి వచ్చారు.
 
 ఆమె రాయదుర్గంలో పర్యటిస్తున్నారు. ఈ విషయమై మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డిలు సీఎం రమేష్‌ను కలిసిన మాట వాస్తవే. అయితే రాయదుర్గంలో ఉషాదేవిని నేను తెరమీదకు తీసుకువచ్చి.. ప్రోత్సహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు సుద్ద అబద్ధం. అందులో నేను డబ్బులు తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్న వారు మూర్ఖులు. నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే జిల్లాలో బీకే పార్థసారథి అంటే ఒక మార్కు ఉంది. దాన్ని నేను మీరను. డబ్బులు తీసుకునేవారు వేరే ఉన్నారు. నేను డబ్బులు తీసుకుని ఉషాదేవిని ప్రోత్సహిస్తున్నానని చెబుతున్న వారు నా ఎదురుగా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయమనండి.. ఎవరు ఏం మాట్లాడినా, ఎన్నికల నాటికి కులాలు, వర్గాలు అన్నీ చూసుకునే మా పార్టీ అధినేత టికెట్ కేటాయిస్తార’ని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement