తిరుపతిలో టూరిస్ట్ బస్సు బీభత్సం | Bus rams into pedestals in tirupati, ttd employees injured | Sakshi
Sakshi News home page

తిరుపతిలో టూరిస్ట్ బస్సు బీభత్సం

Dec 31 2014 9:52 AM | Updated on Aug 25 2018 7:26 PM

తిరుపతిలో టూరిస్ట్ బస్సు బీభత్సం - Sakshi

తిరుపతిలో టూరిస్ట్ బస్సు బీభత్సం

తిరుపతి ఆర్టీసి బస్టాండ్‌ సమీపంలోని శ్రీనివాసం వద్ద ఓ టూరిస్ట్ బస్సు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది.

తిరుపతి ఆర్టీసి బస్టాండ్‌ సమీపంలోని శ్రీనివాసం వద్ద ఓ టూరిస్ట్ బస్సు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. శ్రీనివాసంలోని బస్సు అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు టిటిడి ఉద్యోగులు నర్సయ్య, నరసింహులు కూడా ఉన్నారు.

 గాయపడినవారందరూ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో సాధారణంగా కాస్త మెల్లిగా డ్రైవ్ చేయాలి, అయితే బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన టూరిస్ట్ బస్సు కర్ణాటకకు చెందిందిగా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement