దుబ్బాకలో వైద్యం వికటించి బాలుడు మృతి | Boy dies after doctor treatment failed | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో వైద్యం వికటించి బాలుడు మృతి

Dec 20 2013 5:11 PM | Updated on Jul 12 2019 3:02 PM

వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలిదీసుకుంది. వైద్యం కోసమని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాలుడు వైద్యం వికటించి మృతిచెందాడు.

మెదక్: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలిదీసుకుంది. వైద్యం కోసమని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడు. ఈ ఘటన ఘటన మెదక్ జిల్లాలోని దుబ్బాకలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన ఆ బాలుడికి ఆస్పత్రి వైద్యులు చికిత్స చేస్తుండగా వైద్యం వికటించడంతో ఆ బాలుడు మృతిచెందినట్టు బాలుడి బందువులు ఆరోపిస్తున్నారు.

 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లవాడు మృతిచెందినట్టు వారు వాపోతున్నారు. దీంతో బాలుడి తరపు బంధువులంతా ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement