‘చంద్రబాబుకు ఎందుకంత భయం?’ | botsa sathyanarayana takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు ఎందుకంత భయం?’

Jun 13 2017 2:07 PM | Updated on Jul 12 2019 3:10 PM

‘చంద్రబాబుకు ఎందుకంత భయం?’ - Sakshi

‘చంద్రబాబుకు ఎందుకంత భయం?’

చంద్రబాబు ప్రభుత్వం మాఫియా, దోపిడీ ప్రభుత్వంగా మారిందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూకుంభకోణంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మహాధర్నా చేపడతామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వం మాఫియా, దోపిడీ ప్రభుత్వంగా మారిందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూకుంభకోణంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మహాధర్నా చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో, లోకేశ్‌ నాయకత్వంలో విశాఖ భూకుంభకోణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్నెళ్లుగా పోరాడుతుంటే ప్రభుత్వం కంటితుడుపుగా సిట్‌ ఏర్పాటు చేసిందన్న ఆయన కుంభకోణంపై సీబీఐ విచారణ జరిగాల్సిందేనని, ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత దోపిడీ ఎన్నడూ చూడలేదని, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ బస్సుల ట్రాన్స్‌పోర్ట్‌ మాఫియా నడుస్తోందని, పర్మిట్లు రద్దు చేసినా ప్రైవేట్‌ బస్సులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెప్పారు. బస్సులను సీజ్‌చేయడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని, ట్రాన్స్‌పోర్ట్‌ మాఫియాకు ప్రభుత్వం లొంగిపోవడం వల్లే అధికారులు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement