‘గతంలో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’ | Boppana Bhava Kumar Fires On Gadde Rammohan In Vijayawada | Sakshi
Sakshi News home page

‘గతంలో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’

Nov 17 2019 2:50 PM | Updated on Nov 17 2019 3:02 PM

Boppana Bhava Kumar Fires On Gadde Rammohan In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విహారయాత్రకు అమెరికా వెళ్లి వచ్చిన గద్దె రామ్మెహన్‌ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్‌ అన్నారు. నాలుగు వేల మంది పేదలకు ఇల్లు, ఇళ్లస్థలాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్‌ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తామన్నారు. దేవినేని అవినాష్‌ పార్టీలోకి రావటాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చే అనేకమంది పార్టీలో చేరుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement