ఎన్నికలకు ముందే చంద్రబాబు చేతులెత్తేశారు | BJP Leader Vishnuvardhan Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అస్త్ర సన్యాసం..!

Mar 8 2020 7:46 PM | Updated on Mar 8 2020 7:54 PM

BJP Leader Vishnuvardhan Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ముందే చేతులు ఎత్తేశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారని విమర్శించారు. కోరోనా అంటూ ఎన్నికలను వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరడాన్ని విష్ణువర్ధన్‌ రెడ్డి తప్పుబట్టారు. ఎన్నికలకు భయపడే చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ ప్రభావం ఏపీలో లేకపోయినప్పటికీ.. కరోనా అంటూ టీడీపీ అధికార ప్రతినిధులు విపక్షాలను బలహీన పరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement