ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ | Bike thief arrested | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్

May 30 2015 2:43 PM | Updated on Aug 20 2018 4:27 PM

కర్నూలు జిల్లా బేతంచర్లలోని ఓ పెట్రోలు బంకు వద్ద శనివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు (బేతంచర్ల) : కర్నూలు జిల్లా బేతంచర్లలోని ఓ పెట్రోలు బంకు వద్ద శనివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. తన పేరు భాస్కరాచారి అని, ఇప్పటివరకు 12 బైక్‌లను దొంగిలించానని ఒప్పుకున్నాడు. భాస్కరాచారి దొంగిలించిన 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement