బాబు పాలనలో అపచారాలు: భూమన | Bhumana karunakar reddy on chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో అపచారాలు: భూమన

May 18 2018 5:24 AM | Updated on Jul 28 2018 3:41 PM

Bhumana karunakar reddy on chandrababu naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తిరుమలలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్యాయాలు, ఘోరాలు జరుగు తున్నాయని, కలియుగ దైవం వెలసిన చోట తీవ్ర అపచారాలు చోటు చేసుకుంటున్నా యని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

తిరుమలను వీఐపీలకు సపర్యలు చేసే సత్రంగా మారుస్తున్నారనే ఆవేదనతో  ప్రధాన అర్చకుడైన రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేస్తే పదవీ విరమణ పేరుతో పాలక మండలి ఆయనపై వేటుకు సిద్ధమైందన్నారు. శ్రీవారి ఆలయంలో ఎప్పుడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు టీటీడీ సమాధానం చెప్పకుండా చర్యలకు దిగటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement