చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా? | battula bramhananda reddy takes on chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా?

Feb 23 2017 3:54 PM | Updated on Jul 28 2018 6:35 PM

చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా? - Sakshi

చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో 7 లక్షల ఎకరాల భూసేకరణకు సిద్ధమైనట్టు ప్రకటించిందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో 7 లక్షల ఎకరాల భూసేకరణకు సిద్ధమైనట్టు ప్రకటించిందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు, భూమికి ఉన్న బంధం తెలియదా? అని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో రైతుల పొట్టగొట్టి, పెద్దలకు కట్టబెట్టే యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ చేయకపోగా, రైతుల నెత్తిన అధిక భారం మోపారని విమర్శించారు. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోకుంటే తగిన గుణపాఠం తప్పదని బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement