కర్నూలులో కొనసాగుతున్న బంద్ | Bandh Continue In Kurnool city | Sakshi
Sakshi News home page

కర్నూలులో కొనసాగుతున్న బంద్

Sep 3 2014 10:59 AM | Updated on Aug 20 2018 2:00 PM

విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ రాజధాని సాధన సమితి నిరసన వ్యక్తం చేసింది.

కర్నూలు: విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ రాజధాని సాధన సమితి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. దాంతో నగరంలోని విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. దీంతో కర్నూలు నగరంలో జనజీవనం స్తంభించింది. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేస్తుంది.

గతంలో ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేదని ఈ సందర్భంగా ఆ సమితి గుర్తు చేసింది. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్కు తరలిపోయిందని.... రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని మళ్లీ కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కానీ ఆ ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ రాజధాని సాధన సమితి బంద్కు పిలుపు నిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement