బెదిరించాడు... బెయిల్ రద్దయింది | Bail cancelled for Transco Assistant Engineer in Bribe case | Sakshi
Sakshi News home page

బెదిరించాడు... బెయిల్ రద్దయింది

May 31 2015 11:10 AM | Updated on Sep 3 2017 3:01 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ విద్యుత్ అధికారి బెయిలును...ఫిర్యాదుదారుడిని బెదిరిస్తున్నందుకు న్యాయస్థానం రద్దు చేసింది.

కర్నూలు : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ విద్యుత్ అధికారి బెయిలును...ఫిర్యాదుదారుడిని బెదిరిస్తున్నందుకు న్యాయస్థానం రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే...  గత మార్చిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ ట్రాన్స్‌కో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ చంద్రశేఖర్‌కు అదే నెల చివరిలో బెయిల్ మంజూరైంది. అయితే  ఆయన ఫిర్యాదుదారు వెంకటేశప్పను బెదిరింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు ఏసీబీ కోర్టు పీపీ వెంకటేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని విన్నవించటంతో అందుకు కోర్టు శనివారం సమ్మతించింది.

Advertisement
 
Advertisement
Advertisement