తాడేపల్లి: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఐదుగురు మృతిచెందడంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాని ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్.
కాగా, కర్నూలు జిల్లాలో శనివారం(నవంబర్ 29) తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.



