బీటెక్ విద్యార్థిని అదృశ్యం | B.Tech student missing | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థిని అదృశ్యం

Oct 20 2015 4:12 PM | Updated on Sep 3 2017 11:15 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని రామచంద్రా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యం అయ్యింది.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని రామచంద్రా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యం అయ్యింది. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన ప్రీతి సోమవారం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో తల్లిదండ్రులు రామచంద్రా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి విచారించారు. సాయంత్రం 5 గంటలకే ప్రీతి వెళ్లిపోయిందని అక్కడివారు చెప్పడంతో తెలిసినవారిని విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement