లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంపాలెంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలోని ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన పై నగరంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..శుక్రవారం 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉన్న బాలికలు నగరంపాలెంలోని స్కూల్‌కు వచ్చారు. ఇద్దరు కలిసి వారి స్కూల్ బ్యాగులను పాఠశాల ఆవరణలో ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో పాఠశాల, వసతి గృహం నిర్వాహకులు నగరంపాలెం పోలీసులకు సమాచారమిచ్చారు.
సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో ప్రభుత్వ వసతి గృహం వద్దకు వచ్చి బాలికల వివరాలను సేకరించారు. వసతి గృహ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాలికలు స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నారని, వారి ఆచూకీ తెలిసిన వారు 8688831336, 8688831340, 8688831612, 8688831339 నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు.


