సీపీఎం నేతలపై దుండగుల దాడి | attacks on cpm leaders in guntur district | Sakshi
Sakshi News home page

సీపీఎం నేతలపై దుండగుల దాడి

Feb 9 2016 6:47 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. సుందరయ్యనగర్‌కు చెందిన సీపీఎం నేతలు ఆంజనేయులు, సతీష్‌పై మంగళవారం దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. సుందరయ్యనగర్‌కు చెందిన సీపీఎం నేతలు ఆంజనేయులు, సతీష్‌పై మంగళవారం దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు.

గమనించిన స్థానికులు ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచ్చారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థల వివాదమే హత్యకు కారణమై ఉంటుందని తెలుస్తుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా సీపీఎం నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నాకి దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement