సీఎం జగన్‌కు పెమఖండు కృతజ్ఞతలు | Arunachal Pradesh CM Pema Khandu Thanks To AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం కృతజ్ఞతలు

Mar 27 2020 7:34 PM | Updated on Mar 27 2020 8:30 PM

Arunachal Pradesh CM Pema Khandu Thanks To AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమఖండు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్‌ వేదికగా పెమఖండు స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉంటున్న తమ రాష్ట్రవాసులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లు స్పందించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రవాసులకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా తమ రాష్ట్రానికి చెందిన వారికి అండగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు.

కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ పక్కాగా అమలు జరుగుతోంది. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement