ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు | APPSC exam date changes | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు

Feb 17 2017 2:28 AM | Updated on Sep 5 2017 3:53 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను మార్పు చేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను మార్పు చేసింది. టెక్నికల్‌ అసి స్టెంటు (మైనింగ్‌) పోస్టుల పరీక్షను మా ర్చి 2కు బదులు 3న నిర్వహిస్తారు. టెక్ని కల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్సు) పోస్టు పరీ క్షను య«థాతథంగా మార్చి 3న ఉంటుం ది. ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టు కు 3 పేపర్ల పరీక్షను మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తామని ఇదివరకు ప్రకటించగా మార్చి 4, 5 తేదీల్లోకి మార్పు చేశారు.

సివి ల్‌ అసిస్టెంటు సర్జన్‌ పోస్టుల పరీక్షను మార్చి 3కు బదులు మార్చి 4న నిర్వహి స్తారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టు పరీక్షను మార్చి 3కు బదులు 4న నిర్వహిం చనున్నారు. అసిస్టెంటు ఆర్కిటెక్చర్, సర్వే యర్, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు మార్చి 3కు బదులు మార్చి 5న నిర్వహిం చనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్య దర్శి గురువారం ఓప్రకటన జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement