మంత్రి అయ్యన్ననివాసం ముట్టడి | Ap Nirudhyoga Ikya Vedika dharna at minister ayyanna home | Sakshi
Sakshi News home page

మంత్రి అయ్యన్ననివాసం ముట్టడి

Aug 28 2015 12:39 PM | Updated on Sep 19 2019 2:50 PM

ఎంపీడీవో పోస్టులను అమ్ముకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య వేదిక డిమాండ్ చేసింది.

మహారాణిపేట: ఎంపీడీవో పోస్టులను అమ్ముకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. విశాఖలోని మంత్రి అయ్యన్నపాత్రుడి నివాసాన్ని ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరుద్యోగులు శుక్రవారం ముట్టడించారు. మంత్రి నివాసం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

122 ఎంపీడీవో పోస్టులను, ఈవోపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంత్రి అయ్యన్నపాత్రుడు అమ్మకుని నిరుద్యోగులను నిరాశపరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,600 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు, ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ పోస్టులను ఎపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement