విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం: వెంకట్రామిరెడ్డి | AP Employees Ready To Go Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం: వెంకట్రామిరెడ్డి

Mar 18 2020 2:42 PM | Updated on Mar 18 2020 3:02 PM

AP Employees Ready To Go Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం అధ్యకుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల అవసరాలపై ప్రత్యేక పత్రాల ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. మే 31 లోపు ఉద్యోగులను విశాఖ తీసుకెళ్లాలని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement