ఏపీ ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు | AP Ed set counseling from 8th | Sakshi
Sakshi News home page

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు

Jul 19 2016 6:51 PM | Updated on Sep 4 2017 5:19 AM

ఆగస్టు 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో బీఈడీ కళాశాలలో ప్రవేశానికి ఆగస్టు 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు ఈనెల చివరి వారంలో జరగాల్సిన కౌన్సెలింగ్.. వివిధ బీఈడీ కళాశాలల వివరాలను సంబంధిత యూనివర్సిటీలు పంపకపోవడం, కొన్ని కళాశాలలు పీ రెగ్యులేటరీ కమిషన్‌ను సంప్రదించకపోవడంతో వాయిదా పడిందన్నారు. వచ్చే 8, 9, 10 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, 9, 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 16వ తేదీ సీట్ల కేటాయింపు పూర్తి చేసి 17 నుంచి తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement