తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | Tension At Tirupati Sp Office | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Jul 6 2026 11:36 AM | Updated on Jul 6 2026 3:28 PM

Tension At Tirupati Sp Office

తిరుపతి జిల్లా: బూతు ఎమ్మెల్యే మాకొద్దని పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. పులివర్తి నాని బూతు మాటలు, రోత పనులపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారు. నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

పోలీసులు వైఖరి నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణకు డిమాండ్‌ చేస్తూ.. వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టింది. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఇంఛార్జ్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడును బూతులు తిట్టిన ఎమ్మెల్యే నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీవాళ్ళు బూతులు తిడితే కేసులు ఉండవా?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement