సీఎం వైఎస్‌ జగన్‌: ఢిల్లీ బయల్దేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ | YS Jagan Dilhi Tour to Meet Amit Shah and other Union Ministers on Oct 21st - Sakshi
Sakshi News home page

ఢిల్లీ బయల్దేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌

Oct 21 2019 3:56 AM | Updated on Oct 21 2019 11:06 AM

Ap Cm Ys Jagan Mohan Reddy Visit Delhi Today - Sakshi

సాక్షి, అమరావతి : రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 22న కూడా ఆయన ఢిల్లీలో ఉంటారు. ఇవాళ ఉదయం 10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి  సీఎం ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 2.05 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని చర్చిస్తారు.  సీఎం సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బసచేస్తారు. 22వ తేదీ మ.3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ ఆయన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement