ఏపీ రాజధాని ప్రాంతం 122 కిలోమీటర్లు | AP capital city region with in 122 kilometers, says AP Government | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధాని ప్రాంతం 122 కిలోమీటర్లు

Jan 1 2015 5:03 PM | Updated on Aug 18 2018 8:05 PM

ఏపీ రాజధాని ప్రాంతం 122 కిలోమీటర్లు - Sakshi

ఏపీ రాజధాని ప్రాంతం 122 కిలోమీటర్లు

122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతంగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

హైదరాబాద్: 122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతంగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మరో 7068 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా గుర్తించామని తెలిపింది. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్పై రూపొందించిన రూల్స్ను ఏపీ ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 1 జారీ చేసింది. అలాగే విజయవాడ - గుంటూరు మధ్య గ్రీన్ఫీల్డ్స్ రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో మరో మూడు మెగా సిటీలతోపాటు 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని తెలిపింది.

కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ల్యాండ్ పూలింగ్ చేపడతామని వివరించింది. ల్యాండ్ పూలింగ్ కోసం విధివిధానాలు ఖరారు చేసేందుకే మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటైందని పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించిన సంగతిని గుర్తు చేసింది. ప్రణాళిక, సమన్వయం, అమలు, పర్యవేక్షణ, ఆర్థిక తీరు, నిధులు, ప్రమోటింగ్ కోసం సీఆర్డీఏ ఏర్పాటు చేసినట్లు విశదీకరించింది. 2014, డిసెంబర్ 30 నుంచి సీఆర్డీఏ అమల్లోకి వచ్చిందని తెలిపింది.స్వచ్ఛంద పద్దతిలో ల్యాండ్ పూలింగ్ కోసం సీఆర్డీఏకు అధికారాలు కట్టబెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement