నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం | ap cabnit meet today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

Dec 16 2017 11:04 AM | Updated on Aug 18 2018 5:15 PM

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ‍్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ డీజైన‍్లను ఆమోదించడంతోపాటు, 2014 పోలీస్ యాక్ట్ సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూకేటాయింపులు, రూ.4,234 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై సమావేశంలో చర్చించనున‍్నట్లు సచివాలయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement