చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, అసెంబ్లీ వాయిదా | ap assembly adjourned 10 minutes | Sakshi
Sakshi News home page

చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, అసెంబ్లీ వాయిదా

Mar 10 2015 9:11 AM | Updated on Jul 23 2018 6:55 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో డ్వాక్రా రుణాల మాఫీపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు.  

మహిళాద్రోహి చంద్రబాబు అంటూ సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడలేదు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement