సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశించింది. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది.
ఫేజ్-1కింద పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నాలుగు కాలేజీలను డెవలపర్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం,నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


