దేవాశీష్ బోస్ మృతదేహం లభ్యం | another student dead body found in bias river | Sakshi
Sakshi News home page

దేవాశీష్ బోస్ మృతదేహం లభ్యం

Jun 10 2014 10:19 AM | Updated on Sep 2 2017 8:35 AM

దేవాషిస్ బోస్ (ఫైల్)

దేవాషిస్ బోస్ (ఫైల్)

బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు బాగ్‌అంబర్‌పేట సీఈకాలనీకి చెందిన దేవాషిస్ బోస్ గా గుర్తించారు.

మండి (హిమాచల్‌ప్రదేశ్): బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు బాగ్‌అంబర్‌పేట సీఈకాలనీకి చెందిన దేవాశీష్ బోస్ గా గుర్తించారు. బోస్ తండ్రి రాబిన్‌బోస్ నిన్ననే సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మరణవార్త తెలియడంతో బోస్ తల్లి నిర్మల భోరున విలపించారు. దీంతో ఇప్పటివరకు మృతదేహాలు వెలికితీసినట్టయింది. ఇంకా 19 మంది ఆచూకీ చేయాల్సివుంది. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

నిన్న నలుగురు మృతదేహాలు వెలికితీశారు. సోమవారం అర్థరాత్రి ఈ మృతదేహాలను హైదరాబాద్ కు తరలించారు. ఈ నలుగురు అల్వాల్‌కు చెందిన దుర్గాదాస్ కుమార్తె గంపల ఐశ్వర్య, కూకట్‌పల్లికి చెందిన రాధాకృష్ణ కుమార్తె అప్పనబోట్ల లక్ష్మిగాయత్రి, చర్లపల్లికి చెందిన సూర్యకుమార్ కుమార్తె ఆకుల విజేత, నల్గొండ జిల్లా బిక్యాతాండాకు చెందిన శేఖర్‌నాయక్ కుమారుడు బానోతు రాంబాబుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement