మండీ బిర్యానీ తిని ఆస్పత్రి పాలు | four fall ill after eating mandi biryani as rao nagar hyderabad | Sakshi
Sakshi News home page

మండీ బిర్యానీ తిని ఆస్పత్రి పాలు

Mar 26 2026 7:19 AM | Updated on Mar 26 2026 9:22 AM

four fall ill after eating mandi biryani as rao nagar hyderabad

మేడ్చల్ జిల్లా: ఏఎస్‌రావునగర్‌లోని ఓ మండీ హోటల్‌లో బిర్యానీ తిన్న నలుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాలుగు రోజుల క్రితం హోటల్‌కు వెళ్లి మండీ బిర్యానీ తిని ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో జమ్మిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.

 మండీ బిర్యానీ తినడం వల్లే ఆస్పత్రి పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు సదరు హోటల్‌ను పరిశీలించేందుకు వెళ్లగా, అది మూసి ఉంది. హోటల్‌ మూసి ఉండటంతో ఏమీ తెలుసుకోలేకపోయామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాప్రా సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అధికారిణి నిలీషా తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement