'హైదరాబాద్లో భూములు అమ్ముకున్న చంద్రబాబు' | Anjan kumar yadav takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్లో భూములు అమ్ముకున్న చంద్రబాబు'

Jan 22 2014 2:34 PM | Updated on Sep 4 2018 5:07 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ను తానే అభివృద్ది చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో భూములు అమ్ముకొని తాను మాత్రమే అభివృద్ధి చెందాడని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా చంద్రబాబు 400 ఏళ్ల పాలనలో నిజాం సికింద్రాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారని, 9 ఏళ్ల తమపాలనలో హైదరాబాద్ నగరం మొత్తాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ను సింగపూర్లా అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement