వచ్చే నెల 4న ఏపీ, కర్ణాటక సీఎంల భేటీ! | andhrapradesh, karnataka chief ministers to meet on november 4th | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 4న ఏపీ, కర్ణాటక సీఎంల భేటీ!

Oct 28 2014 9:07 PM | Updated on Jul 28 2018 3:23 PM

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, సిద్దరామయ్యలు వచ్చే నెల 4న సమావేవశమయ్యే అవకాశముంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, సిద్దరామయ్యలు వచ్చే నెల 4న సమావేవశమయ్యే అవకాశముంది. చంద్రబాబు బెంగళూరులో సిద్ధరామయ్యను కలసి కృష్ణా నదీజలాల విషయం చర్చించనున్నట్టు సమాచారం.

మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాలతో నదీజలాల అంశం గురించి చర్చించారు. తుంగభద్ర హెచ్ఎల్సీ నీటి నుంచి 32 టీఎంసీలను ఏపీ వినియోగించుకునేలా సిద్ధరామయ్యను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించనున్నారు. అలాగే ఇతర నదీ జలాల అంశాలను చంద్రబాబు చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement