'ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారు' | anata venkatarami reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారు'

Oct 19 2014 1:39 PM | Updated on Jul 28 2018 6:33 PM

'ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారు' - Sakshi

'ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి కష్టాలతో రాయలసీమ అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్ర బాబు ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు. కండబలం ఉన్న వారే తాగునీరు తీసుకువెళ్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?అని ప్రశ్నించారు.

 

సీమ ప్రయోజనాలను వదిలి నాగార్జునసాగర్, పులిచింతలకు 80 క్యూసెక్కుల నీరు ఎలా ఇస్తారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలె చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అనంత ఎద్దేవా చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement