‘బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలలో కోత’

Allahabad Bank Officers Association Protest Against Banks Merge Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల విలీన నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేలా ఉందని అలహాబాద్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో అసోసియేషన్‌ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకు ఉద్యోగాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాంక్ ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్మకాసేలా ఈ నిర్ణయం ఉందని విమర్శించారు. బ్యాంకుల విలీన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, విలీన నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చదవండి : ‘ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలి’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top