'అన్ని ప్రవేశ పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే' | all entrance exams condut online only says ap minister ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

'అన్ని ప్రవేశ పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే'

Nov 29 2016 6:47 PM | Updated on Sep 5 2018 8:36 PM

'అన్ని ప్రవేశ పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే' - Sakshi

'అన్ని ప్రవేశ పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే'

అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు గంటా చెప్పారు.

విజయవాడ : ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో విద్యాశాఖ ఉన్న‌తాధికారులు, ఉన్న‌త విద్యామండ‌లి అధికారుల‌తో మంత్రి మంగ‌ళ‌వారం స‌మీక్ష‌స‌మావేశం నిర్వ‌హించారు.

అన్ని ఎంట్రన్స్‌లు ఆన్‌లైన్‌లోనే నిర్వహించే క్రమంలో సమర్ధంగా పనిచేసే ఏజెన్సీలను ఎంపిక చేయాలని సూచించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీలోగా నివేదిక అందిన వెంటనే ఏ యూనివర్శిటీకి, ఏ పరీక్షల బాధ్యతలు ఇవ్వాలో ఎంపిక చేసి, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement