'గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తాం' | Agriculture Minister vists hudhud cyclone affected areas in Vizinagaram District | Sakshi
Sakshi News home page

'గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తాం'

Oct 25 2014 11:10 AM | Updated on Jun 4 2019 5:04 PM

భూముల పట్టాలు లేని గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.

విజయనగరం: భూముల పట్టాలు లేని గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. శనివారం విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని హుదూద్ తుపాను ప్రభావంతో పంట కోల్పోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పంట నష్టంపై రైతులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తుపాను  సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులతోపాటు టీడీపీ నేతలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement