పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు 

Adimulapu Suresh Helps A Couple Near Kotappakonda - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పెద్ద మనసును చాటుకున్నారు. తను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి క్షతగాత్రులకు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. కోటప్పకొండ సమీపంలో ఆదివారం బైక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ఆదిమూలపు సురేశ్‌ ఈ ఘటనను గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. 108ని పలిపించడమే కాకుండా.. దగ్గరుండి దంపతులకు ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి స్పందించిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top