ముక్కంటి సేవలో నటి శ్రీదేవి | actress sridevi at srikalahasti temple | Sakshi
Sakshi News home page

ముక్కంటి సేవలో నటి శ్రీదేవి

Mar 15 2017 8:48 PM | Updated on Apr 3 2019 9:16 PM

సినీ నటి శ్రీదేవి తమ కుటుంబ సభ్యులతో బుధవారం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు.

శ్రీకాళహస్తి: సినీ నటి శ్రీదేవి తమ కుటుంబ సభ్యులతో బుధవారం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. వారికి ఆలయాధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి అర్చన చేయించుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు.  వారితోపాటు ఆలయ చైర్మన్‌ సీసీ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. ఆలయ అర్చకులతోపాటు పలుపురు పోటీలు పడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement