ఏసీబీ వలలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ | acb caught tanakallu SI, head constable | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్

May 12 2015 2:23 PM | Updated on Sep 2 2018 3:51 PM

లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా తనకల్లు పోలీస్‌స్టేషన్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ ఏసీబీ కి దొరికారు.

అనంతపురం : లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా తనకల్లు పోలీస్‌స్టేషన్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ ఏసీబీ కి దొరికారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలివీ...కదిరికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి చెందిన ఇసుక ట్రాక్టర్‌ను ఈనెల 4వ తేదీన రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. దానిని విడిపించుకునేందుకు తహశీల్దారు నుంచి అనుమతి పొందారు. అయితే, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఆ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాలంటే రూ.6 వేలు ఇవ్వాలని ఎస్సై రమేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో శ్రీరాములు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌కు డబ్బు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం అడిగిన ఎస్సై రమేష్‌రెడ్డితోపాటు హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
(తనకల్లు)


 

Advertisement
 
Advertisement
Advertisement