పంచలింగాల చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు | acb attacks on panchalingala checkpost | Sakshi
Sakshi News home page

పంచలింగాల చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు

Nov 21 2015 10:48 AM | Updated on Aug 17 2018 12:56 PM

కర్నూలు జిల్లా లోని పంచలింగాల వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు శనివారం ఉదయం దాడులు చేపట్టారు.

కర్నూలు: కర్నూలు జిల్లా లోని పంచలింగాల వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు శనివారం ఉదయం దాడులు చేపట్టారు. అక్రమ వసూళ్లపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. రికార్డుల్లోని వివరాల ప్రకారం.. రూ.50 వేలు అదనంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇద్దరు అధికారులతోపాటు ప్రైవేటు సహాయకులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement