breaking news
Panchalingala
-
కర్నూలులో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కర్నూలు ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.3కోట్ల విలువైన 7 కేజీల బంగారం, రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వీటిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కారులో నగదు, బంగారాన్ని హైదరాబాద్ నుండి బెంగళూరుకి తరలిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. -
భారీగా బంగారం, నగదు పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల 5లక్షల 35వేల 500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, బంగారం సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు తరలిస్తుండగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం -
పంచలింగాల చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు
కర్నూలు: కర్నూలు జిల్లా లోని పంచలింగాల వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు శనివారం ఉదయం దాడులు చేపట్టారు. అక్రమ వసూళ్లపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. రికార్డుల్లోని వివరాల ప్రకారం.. రూ.50 వేలు అదనంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇద్దరు అధికారులతోపాటు ప్రైవేటు సహాయకులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
తుంగభద్రకు తూట్లు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నదీ తీర ప్రాంతాల్లో మాఫీయా మాటేసింది. లాభాలు అధికం కావడంతో అక్రమార్కులు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడటం లేదు. అధికారులను నయానోభయానో దారికి తెచ్చుకుంటూ బేరం కుదుర్చుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వారికి వాటాలు ముడుతుండటంతో వ్యవహారం గుట్టుగా సాగిపోతోంది. ప్రధానంగా నదీ తీర గ్రామాలైన నిడ్జూరు, మనగాలపాడు, పంచలింగాల, ఇ.తాండ్రపాడు, దేవమాడ, పడిదెంపాడు, పూడూరు నుంచి రాత్రి 10 గంటల తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు ఇసుక తరలింపు జోరందుకుంటోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తూ.. ఆ తర్వాత జేసీబీలతో లారీల్లోకి నింపి హైదరాబాద్, శంషాబాద్, బళ్లారి తదితర సుదూర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైరదాబాద్‌లో డిమాండ్ దృష్ట్యా లారీ ఇసుక ధర లక్ష రూపాయలకు పైనే పలుకుతోంది. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ప్రత్యేక టీములు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జాతీయ రహదారి, ఇసుక తరలించేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంది. అయితే టీమ్ సభ్యులు తీరిక సమయాల్లో చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. కొందరు సభ్యులు ఒక్కో వాహనానికి రేటు కట్టి వసూలు చేస్తుండటం కూడా తరలింపునకు మార్గం సుగమం చేస్తోంది. తనిఖీల్లో ట్రాక్టర్లు పట్టుబడితే ఆయా ప్రాంతాల్లోని వీఆర్వోలు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు దండుకుంటున్నారు. గత నెల 18న ఏర్పాటైన టీమ్ ఇప్పటి వరకు 24 ట్రాక్టర్లు, రెండు లారీలను మాత్రమే సీజ్ చేయడం వారి పనితీరుకు నిదర్శనం. ఆదాయం అధికంగా ఉండటంతో ఓ ఆర్ఐ తన విధులను పక్కనపెట్టి ఇసుక లారీలపైనే అధికంగా దృష్టి సారిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మరో సీనియర్ అసిస్టెంట్.. పట్టణం, గ్రామీణ ప్రాంతానికి చెందిన వీఆర్వోలు.. ఇటీవల వీఆర్వోలుగా విధుల్లో చేరిన మరో ఇద్దరు అక్రమ వసూళ్లలో తలమునకలవుతున్నారు. నదీ తీర గ్రామాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా వీరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పత్రికల్లో వార్తలు ప్రచురితమైన మరుసటి రోజు ఆర్డీఓ, తహశీల్దార్లు హడావుడి చేస్తున్నా ఆ తర్వాత షరా మామూలే. వారం రోజుల క్రితం ఏపీ28 టీఈ 2349 లారీని సీజ్ చేశారు. నాలుగు రోజులకే ఆ వాహన యజమానితో ఓ ఆర్ఐ రూ.25 వేల జరిమానా కట్టించి.. సుమారు రూ.75 వేలు తన ఖాతాలోకి వేసుకున్నట్లు ఆ శాఖ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. పంచలింగాల, దేవమాడ గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులే నేరుగా హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన బిల్డర్లతో మాట్లాడుకుని మొబైల్ టీమ్ సభ్యుల సహకారంతో రోజూ పదుల సంఖ్యలో లారీలను తరలించేస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహనాలను సీజ్ చేస్తే రవాణాకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సి ఉంది. భూగర్భ, గనుల శాఖ అధికారులతో పాటు తహశీల్దార్లకు ఆ వివరాలను తెలియజేసి వారి స్పందన మేరకు వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. ట్రాక్టరుకు రూ.12 వేల నుంచి రూ.25 వేలు.. లారీకి రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా వేసి 30 రోజుల పాటు సీజ్ చేసిన అధికారి పరిధిలోనే వాహనం ఉంచుకోవాల్సి ఉన్నా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది.