భార్యా పిల్లలను కత్తితో పొడిచి.. | A tragedy | Sakshi
Sakshi News home page

భార్యా పిల్లలను కత్తితో పొడిచి..

Feb 9 2017 2:23 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఏం కష్టమొచ్చిందో.. ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఓ యువకుడు భార్యా బిడ్డలను దారుణంగా కత్తితో పొడిచి తనూ ఆత్యహత్య చేసుకున్నాడు.

  • గొంతుకోసుకుని భర్త ఆత్మహత్య
  • తిరుపతిలో దారుణం
  • కత్తిపోట్లతో భార్య కడుపులో శిశువు మృతి
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏం కష్టమొచ్చిందో.. ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఓ యువకుడు భార్యా బిడ్డలను దారుణంగా కత్తితో పొడిచి తనూ ఆత్యహత్య చేసుకున్నాడు. కత్తి పోట్లతో భార్య కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. భార్య, కుమార్తె ప్రాణాలతో కొట్టుమిట్టా డుతున్నారు. ఈ ఘటన బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలోని అబ్బన్న కాలనీలో చోటుచేసుకుంది.  తిరుపతి నగరానికి చెందిన సాత్విక్‌కుమార్‌(27) భార్య మహాలక్ష్మి (24), కుమార్తె సాహితి (3)తో కలసి ఉంటున్నాడు. సాత్విక్‌ కొన్నాళ్ల పాటు ఓ సెల్యులార్‌ సంస్థలో ఉద్యోగం చేశాడు. మూడు నెలల కిందటే ఉద్యోగం మానేసి ఇంటీరియర్‌ డెకరేషన్‌ పనులు చేస్తున్నాడు.

    బుధవారం ఉదయం స్కూలుకు వెళ్లి కుమార్తె సాహితిని ఇంటికి తీసుకొచ్చి మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నాడు. తిరుత్తణి ఆలయంలో ఉన్న అత్త శ్యామలతో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తూనే భార్యపై కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న కూతురును కూడా పొడిచాడు. అదే కత్తితో అతనూ గొంతుకోసుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.  గాయాల తో ఉన్న చిన్నారి సాహితీని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్న మహాలక్ష్మి 9 నెలల నిండు గర్భిణి. బుధవారం ఆమె జన్మదినం కూడా. కత్తిపోట్ల కారణంగా ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. మహాలక్ష్మి, సాహితీల పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement