అధికారుల అదుపులో 50మంది బాలలు | 50 children rescued | Sakshi
Sakshi News home page

అధికారుల అదుపులో 50మంది బాలలు

Feb 6 2016 4:06 PM | Updated on Sep 3 2017 5:04 PM

బిహార్ నుంచి వచ్చి భిక్షాటన చేస్తున్న 50 మంది పిల్లలను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : బిహార్ నుంచి వచ్చి భిక్షాటన చేస్తున్న 50 మంది పిల్లలను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని బిహార్‌కు చెందిన 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరు తమ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు.

దీనిపై సమాచారం తెలుసుకున్న అధికారులు.. పోలీసుల సహాయంతో పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పిల్లలు అక్కడున్నవారికి చెందినవారేనా కాదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement