పోలీసులు అదుపులో 300 మంది అనుమానితులు | 300 Suspected people in hyderabad city police custody | Sakshi
Sakshi News home page

పోలీసులు అదుపులో 300 మంది అనుమానితులు

Sep 21 2013 8:35 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఈ రోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న గౌహతి ఎక్స్ప్రెస్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఈ రోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న గౌహతి ఎక్స్ప్రెస్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం దాదాపు 300 మంది ప్రయాణీకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని సికింద్రాబాద్ లోని టీవోలీ సినిమా హాల్ సమీపంలోని కేజేఆర్ గార్డెన్ కు తరలించి విచారిస్తున్నారు. వారిలో కొంత మందిని పోలీసులు విచారించిన పంపించారు. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైందని నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించారు.

 

ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. తమ ఆదుపులో ఉన్న వారికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఏమైన సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించగలమని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement