ఎడ్లబండి కింద పడి బాలుడు మృతి | 3 years boy killed due to accident | Sakshi
Sakshi News home page

ఎడ్లబండి కింద పడి బాలుడు మృతి

Apr 13 2016 2:32 PM | Updated on Jul 12 2019 3:29 PM

ఎడ్ల బండిపై ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు.

మిడ్తూరు: ఎడ్ల బండిపై ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మిడ్తూరులో చోటు చేసుకుంది. గ్రామంలోని నీటి ఎద్దడి కారణంగా స్థానికులు సమీపంలోని చెరువు నుంచి డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన మార్ల శ్రీనివాసులు ఎడ్లబండిపై డ్రమ్ములు వేసుకుని చెరువు వద్దకు బయలు దేరాడు. అదే సమయంలో కొడుకు మహీధర్(3) కుడా ఎండ్లబండి పై ఉండటంతో ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. బండి చక్రాలు అతనిపైగా వెళ్లటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement