మొవ్వలో ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు | 3 Snake Bite Cases Registered In Movva Of Krishna District | Sakshi
Sakshi News home page

మొవ్వలో ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు

Dec 10 2019 8:41 PM | Updated on Dec 10 2019 8:44 PM

3 Snake Bite Cases Registered In Movva Of Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని మొవ్వ మండలంలో పాములు కలకలం సృష్టించడంతో మంగళవారం ఒక్కరోజే ముగ్గురు పాముకాటుకి గురయ్యారు. మొవ్వలో ఈనెలలో ఇప్పటికే 30 పాముకాటు కేసులు నమోదయ్యాయి. పాముల బెడద స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మొవ్వ గవర్నమెంట్ హాస్పిటల్‌లో పాముకాటు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని డాక్టర్ శొంఠి శివరామకృష్ణ అన్నారు. పాము కాటువేస్తే ఎటువంటి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించుకోవాలని సూచించారు. మొవ్వ హాస్పిటల్‌లో పాముకాటు బాధితుల కోసం విరుగుడు ఔషధాన్ని(యాంటీ స్నేక్ వీనమ్) అందుబాటులో ఉంచామని తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిమాణం ఆధారంగా కూడా ప్రమాదపు స్ధాయి ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement