మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత | 25 Students suffer Food poisoning | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

Sep 1 2015 2:50 PM | Updated on Oct 5 2018 6:48 PM

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న  భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పాఠశాలలో వండిన భోజనాన్ని తిన్న వెంటనే విద్యార్థులకు వాంతులు అయ్యాయి. ఉపాధ్యాయులు 108కు ఫోన్‌చేసి విద్యార్థులను రామచంద్రాపురం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అక్కడ విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement