రెండు స్కూలు వ్యాన్‌లకు నిప్పు | 2 school vans damaged in fire accident in nellore district | Sakshi
Sakshi News home page

రెండు స్కూలు వ్యాన్‌లకు నిప్పు

Jan 27 2015 8:41 AM | Updated on Oct 2 2018 3:04 PM

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన రెండు వ్యాన్‌లకు దుండగులు నిప్పంటించారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన రెండు వ్యాన్‌లకు దుండగులు నిప్పంటించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ వ్యాను పూర్తిగా దగ్ధం కాగా, మరో వ్యాన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement