రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం | 2 redsander smaggulers arrested in chittoor distirict | Sakshi
Sakshi News home page

రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

Aug 20 2015 9:25 AM | Updated on Nov 6 2018 5:21 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గురువారం ఫారెస్ట్ అధికారులుల తనిఖీ నిర్వహించారు.

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గురువారం ఫారెస్ట్ అధికారులుల తనిఖీ నిర్వహించారు. మండలంలోని నాగయ్యవారిపల్లె వద్ద తనిఖీలు చేసిన అధికారులు 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.  వారితో పాటు లారీ, వ్యానును సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement