రెండు లారీలు ఢీ, ఇద్దరికి గాయాలు | 2 inured in lorry accident at nellore distirict | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ, ఇద్దరికి గాయాలు

Aug 31 2015 10:31 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అమరావతి హోటల్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అమరావతి హోటల్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి సిమెంట్ లోడుతో చెన్నైకి వెళుతున్న లారీ చిల్లకూరు మండలం అమరావతి హోటల్ సమీపంలో ఆగి ఉన్న ఓ బొగ్గు లారీని ఢీకొంది.

డ్రైవర్ జాకీర్ నిద్ర మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ జాకీర్‌తోపాటు క్లీనర్ తీవ్ర గాయాలతో క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఎస్‌ఐ అంకమ్మ ప్రమాదస్థలికి చేరుకుని డ్రైవర్, క్లీనర్‌లను బయటకు తీసి 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement