త్రిపురాంతకంలో బస్సు బోల్తా: 15 మందికి గాయాలు | 15 people injured in private bus accident | Sakshi
Sakshi News home page

త్రిపురాంతకంలో బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

Nov 9 2013 1:29 PM | Updated on Apr 7 2019 3:24 PM

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొండపైన కొలువైన త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపురం సుందరీ దేవిలను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం బోల్తా పడింది.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొండపైన కొలువైన త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపురం సుందరీ దేవిలను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం బోల్తా పడింది. ఆ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు.

 

అనంతరం 108కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement