బస్సు - లారీ ఢీ: 12 మందికి గాయాలు | 12 passengers injured in accident | Sakshi
Sakshi News home page

బస్సు - లారీ ఢీ: 12 మందికి గాయాలు

Jan 27 2015 10:28 AM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం జిల్లా విడపనకల్ సమీపంలోని రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అనంతపురం: అనంతపురం జిల్లా విడపనకల్ సమీపంలోని రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  బస్సు - ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఉరవకొండ నుంచి హోస్పేట్ వైపు వెళ్తున్న బస్సు ... ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని తప్పించే క్రమంలో లారీని ఢీ కొట్టిందని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement